వర్షాభావం నేపథ్యంలో తక్కువ నీటి పంటలు సాగు చేయండి: మంత్రి తుమ్మల

ప్రతిపక్షం, జూలై 14: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈసారి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నీటి లభ్యత తగ్గవచ్చని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.

‘రైతునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రాధాన్యంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. శాస్త్రవేత్తల సలహాల ఆధారంగా రైతులకు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

Spread the love

Related News

Latest News