కడియం శ్రీహరిపై మీనాక్షి నటరాజన్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

ప్రతిపక్షం, జూలై 14: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి చేరాయి. మంగళవారం ఆమెను కలిసిన మంత్రి సురేఖ, కడియం శ్రీహరి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని ఫిర్యాదు చేశారు.

ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించిన అంశాలను మంత్రి వివరించగా, మీనాక్షి నటరాజన్ సంయమనం పాటించాలని సూచించినట్లు సమాచారం. చిన్నచిన్న విషయాలను పెద్దగా తీసుకోవద్దని సురేఖకు సూచించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వివాదంపై మంత్రి సురేఖ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లను కూడా కలిసి ఫిర్యాదు చేశారు.

Spread the love

Related News

Latest News