కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకొనే నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ..30 నెలలుగా నిరుపేదలకు అండగా గాంధీజీ ఫౌండేషన్

ప్రతిపక్షం, జూన్ 03: చండూరు పట్టణంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించాలనే లక్ష్యంతో గాంధీజీ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమం 30వ నెలకు చేరుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు గాంధీజీ ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి నిరంతరం సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రతి బిడ్డ బాధ్యత అని గుర్తుచేశారు.

గాంధీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 30 నెలలుగా సుమారు రూ.12 లక్షల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు విద్యా సామగ్రి, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.

సమాజంలో ఏ ఆసరా లేని నిరుపేదలకు తోడుగా నిలవడమే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News