ప్రతిపక్షం, జూలై 14: తెలంగాణలో గృహ విద్యుత్ వినియోగదారులకు త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం రూ.25,006 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పంపింది.
కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత ఆధునికీకరించడంతో పాటు వినియోగం, బిల్లింగ్‌లో పారదర్శకత పెరగనుంది.

















