ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు.
తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని, దేశ చరిత్రలోనే ఇంత విస్తృత స్థాయిలో అమలవుతున్న తొలి బీమా పథకం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.

















