ప్రతిపక్షం, జూలై 15: పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ పేరిట విడుదలైన ఓ లేఖలో బలూచిస్థాన్‌లోని 85 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉందని, జాతీయ జెండా, జాతీయ గీతం, కొత్త కరెన్సీ, స్వతంత్ర పాలనా వ్యవస్థను ప్రకటించినట్లు పేర్కొన్నారు.
అలాగే బంగారం, రాగి గనులు, గ్యాస్ ఫీల్డ్‌లు, బొగ్గు గనులు తమ ఆధీనంలో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, బలూచిస్థాన్ స్వాతంత్ర్య ప్రకటనపై పాకిస్థాన్ ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. దీంతో ఈ ప్రచారంపై స్పష్టత రావాల్సి ఉంది.

















