కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసు

ప్రతిపక్షం, జూలై 15: సోషల్ మీడియాలో పార్టీ నేతలు, బీసీ కులాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా మూడు రోజుల్లోగా తన వివరణను సమర్పించాలని ప్రభాకర్ రెడ్డిని ఆదేశించినట్లు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News