ప్రతిపక్షం, జూలై 15: హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ‘ఇందిరమ్మ ఎల్‌ఐజీ’ గృహ నిర్మాణ పథకాన్ని ఈ నెల 20న ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నామని, దశలవారీగా లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1,000 ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని నియోజకవర్గాల్లో స్థలాలను ఇప్పటికే గుర్తించామని, మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

















