ప్రతిపక్షం, జూలై 15: గుజరాత్‌లోని ధోల్కా తాలూకాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలికకు న్యాయం చేయాలని ఆశించి న్యాయవాదిని ఆశ్రయించిన కుటుంబం, మరోసారి మోసానికి గురైంది. కేసు వాదించేందుకు రూ.15 వేల ఫీజు చెల్లించలేమని బాలిక తండ్రి చెప్పడంతో, తన ఇంట్లో పనికి బాలికను పంపించాలని న్యాయవాది రణ్‌వీర్ సూచించినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబం అతని మాట నమ్మి బాలికను పంపగా, ఆ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని న్యాయవాది ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
బాధితులకు అండగా నిలవాల్సిన వ్యక్తే నమ్మకద్రోహానికి పాల్పడటం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















