తెలంగాణ తల్లి కిరీటం, వడ్డాణాన్ని కాంగ్రెస్ దోచుకుపోతోంది: కేటీఆర్

ప్రతిపక్షం, జూన్ 02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావుపై విష ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశంలోని అనేక ప్రాంతాలు తిరస్కరించిన కాంగ్రెస్ పాలన తెలంగాణకు దురదృష్టవశాత్తూ వచ్చిందని వ్యాఖ్యానించారు.

“కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు ఇలా ఏ వర్గం కూడా మోసపోకుండా లేదు” అని కేటీఆర్ విమర్శించారు.

కృష్ణా, గోదావరి జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడలేకపోతోందని ఆరోపించారు. “తెలంగాణ తల్లి కిరీటం, వడ్డాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుపోతోంది” అంటూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రస్తుత ప్రభుత్వ విధానాలు తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

Spread the love

Related News

Latest News