ఎల్‌నినోతో రైతులకు ఇబ్బందులు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రతిపక్షం, జూలై 15: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వర్షాల ఆలస్యంతో సాగు పనులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.

రేపటి నుంచి ఆగస్టు రెండో వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లాల వారీగా పరిస్థితులను సమీక్షించి రైతులకు అవసరమైన సూచనలు అందిస్తామని చెప్పారు.

తక్కువ నీటితో సాగయ్యే కంది, సోయాబీన్, పెసర, మినుము, జొన్న, సజ్జ వంటి పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఈ పంటలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేసిన తుమ్మల, వర్షాభావ పరిస్థితులపై రాజకీయాలు చేయడం కంటే రైతులకు భరోసా కల్పించడం ముఖ్యమని ప్రతిపక్షాలకు సూచించారు.

Spread the love

Related News

Latest News