దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు యూట్యూబర్లకు సుప్రీంకోర్టు జరిమానా

ప్రతిపక్షం, జూలై 15: దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కమెడియన్ సమయ్ రైనా, యూట్యూబర్లు రణ్‌వీర్, ఆశిష్‌లకు సుప్రీంకోర్టు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది.

ఓ కార్యక్రమంలో ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’తో బాధపడుతున్న వ్యక్తిపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గతంలో బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు ఆ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాధితుల సంక్షేమానికి అందించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో కోర్టు జరిమానా విధించింది.

ఈ సందర్భంగా దివ్యాంగుల గౌరవాన్ని కాపాడేందుకు కఠిన చట్టాల అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రక్షణ చట్టం తరహాలో దివ్యాంగుల హక్కులను పరిరక్షించే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Spread the love

Related News

Latest News