ఏపీ నాయకుల విగ్రహాలపై కవిత వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూన్ 01: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తమ అభ్యంతరాలు కొందరు రాజకీయ నాయకుల చర్యలపైనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణలో కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకుల విగ్రహాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ, అధికారంలోకి వస్తే వాటిని తొలగిస్తామని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

అదే సమయంలో తెలంగాణలో స్థిరపడిన ప్రజలను తమవారిగానే భావిస్తామని, వారిపై ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ అస్తిత్వం, రాజకీయ స్వయంప్రతిపత్తికి భంగం కలిగించే చర్యలను మాత్రం సహించబోమని హెచ్చరించారు.

కవిత వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, అధికార పార్టీ నేతలు కూడా స్పందించే అవకాశం కనిపిస్తోంది.

Spread the love

Related News

Latest News