ప్రధాని మోదీకి విద్యార్థుల గురించి మాట్లాడే తీరిక లేదా: రాహుల్ గాంధీ

ప్రతిపక్షం, జూన్ 01: సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ ప్రక్రియలో తలెత్తిన సమస్యలు కేవలం నిర్లక్ష్యం వల్ల జరిగినవి కాదని, ఇది కుమ్మక్కుతో జరిగిన వ్యవహారమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఈ అంశంపై స్పందించిన రాహుల్ గాంధీ, ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మామిడి పండ్ల గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీకి 18.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యపై మాట్లాడే సమయం లేదా అని ప్రశ్నించారు.

సీబీఎస్‌ఈ టెండర్ నిబంధనల్లో మార్పులు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. నిబంధనల ప్రకారం పరీక్ష పత్రాలను 300 DPI నాణ్యతతో ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల ద్వారా స్కాన్ చేయాల్సి ఉండగా, వాటికి బదులుగా మొబైల్ ఫోన్లను ఉపయోగించారని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఇలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News