ప్రతిపక్షం, జూన్ 03: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పీచేర్యాగడి తండాలో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టయింది. రెండు ఎకరాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు దాడులు నిర్వహించారు.
దాడుల్లో సుమారు 3 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ముంబై నుంచి ముడి పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ముంబైకి తరలించినట్లు సమాచారం.

















