అంగన్‌వాడీల్లో సేవలు మెరుగుపర్చాలి.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 15: మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి సీతక్క సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. శాఖ పరిధిలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు, పప్పు వంటి పోషకాహార సరఫరా నిరంతరాయంగా కొనసాగాలని, టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారుల హాజరు పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. వివిధ సంక్షేమ పథకాల కింద నిధుల విడుదల, వ్యయంపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించిన మంత్రి, ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Spread the love

Related News

Latest News