మానవాళి మనుగడకు చెట్లే ప్రాణాధారo

•ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి: వనపర్తి ఎమ్మెల్యే. మేఘా రెడ్డి

•జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

•పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ వనపర్తిలో సైక్లింగ్ కార్యక్రమo

ప్రతిపక్షం, జూన్ 03, వనపర్తి ప్రతినిధి: మానవాళి మనుగడకు చెట్లే ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని వనపర్తి ఎమ్మెల్యే. మేఘా రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏకో పార్కులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సైక్లింగ్ కార్యక్రమానికి వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానికులతో కలిసి ఎకో పార్కులో ఐదు కిలోమీటర్ల మేర సైక్లింగ్, వాకింగ్ కార్యక్రమంలో పాల్గొని సైకిల్ తొక్కి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించి, రాష్ట్రంలో 33 శాతం అటవీ సంపదను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మానవాళి మనుగడకు చెట్లే ప్రాణాధారమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని తెలిపారు.రాబోయే రోజుల్లో ప్రభుత్వం అడవుల విస్తీర్ణాన్ని ఇంకా పెంచేందుకు చర్యలు చేపట్టబోతుందని తెలిపారు.ప్రతి ఒక్కరికి అడవుల పెంపకం పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ సందర్శించి అటవీ శాఖ పరిధిలో చెక్ డాంలు,కుంటాలను పరిశీలన చేయడం జరిగింది అన్నారు.

జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు:జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా అదేవిధంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎకో పార్కులో సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. మొక్కలు నాటడం పై ప్రజలలో అవగాహన కల్పించి, జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే, కలెక్టర్ కు చిత్ర ప్రదర్శన ద్వారా అటవీశాఖ అధికారులు వివరించారు.కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ ఆశిష్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, డిపిఆర్ఓ సీతారాం, డి వై ఎస్ ఓ సుధీర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News