ప్రతిపక్షం, జూన్ 03: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌంటర్ స్పందన రావగా, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వాటిని ఖండించారు.
అయితే ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి అధికారిక స్పందన రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఇవాళ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ నిర్వహించనున్న ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంపై అందరి దృష్టి నెలకొంది. పవన్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

















