వచ్చే ఏడాది తెలంగాణలో పాదయాత్ర.. డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత ఇవ్వాలి: కేటీఆర్

ప్రతిపక్షం, జూలై 15: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.

డీలిమిటేషన్ బిల్లుపై స్పందించిన కేటీఆర్.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ప్రస్తుతం ఉన్న 24 శాతం వాటా కొనసాగిస్తేనే బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఎలాంటి డీలిమిటేషన్‌ను అంగీకరించబోమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం ఇప్పటివరకు 73 సార్లు ఢిల్లీకి వెళ్లినా తెలంగాణకు 73 పైసలైనా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు, ప్రాజెక్టులు సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీకి ప్రజల్లో ఆదరణ లేదని, రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీకి అవకాశం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Spread the love

Related News

Latest News