‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. ఆర్టీసీ బస్సు బోర్డుపై సోషల్ మీడియాలో చర్చ

ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసినట్లు చెబుతున్న ఓ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’ అనే వాక్యంతో ఉన్న బోర్డు ఫొటోను కొందరు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ బోర్డు సూర్యాపేట మార్గంలో నడిచే ఓ ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ఫొటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బోర్డులో ఉన్న ‘స్త్రీలను’ అనే పదాన్ని మార్చి, దాని స్థానంలో ‘పురుషులను’ అని డిజిటల్‌గా మార్ఫింగ్ చేసి నకిలీ చిత్రాన్ని సృష్టించారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. దీంతో వైరల్ అవుతున్న ఫొటో నిజమైనదా? లేక మార్ఫింగ్ చేసినదా? అనే చర్చ మొదలైంది.

ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన బోర్డులు, సూచనలు, అధికారిక సమాచారాన్ని మార్ఫింగ్ చేయడం లేదా వాటిపై ఉన్న స్టిక్కర్లు, పదాలను ఉద్దేశపూర్వకంగా మార్చడం చట్టపరంగా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తప్పుడు చిత్రాలను సృష్టించడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని సూచిస్తున్నారు.

వైరల్ అవుతున్న ఫొటోపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Spread the love

Related News

Latest News