ప్రతిపక్షం, జూలై 16: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటం ఫలించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్మికుల సమస్యలపై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కవిత నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం స్పందించినట్లు తెలిపారు.
కవిత నిరాహార దీక్షకు దిగితే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే మెడికల్ బోర్డు ఏర్పాటుపై యాజమాన్యం ప్రకటన చేయాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇది సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత చేసిన పోరాటానికి లభించిన విజయమని తెలిపారు.
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సమస్యలపై కవిత నిరంతరం పోరాడుతున్నారని.. ఆమె ఒక సమస్యను ప్రస్తావిస్తే దాని పరిష్కారం కోసం చివరి వరకు పోరాడుతారని పార్టీ నాయకులు అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కవిత చేస్తున్న కృషికి సింగరేణి కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు.


















