ప్రతిపక్షం, జూన్ 02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సృజనాత్మకత, వ్యాపార దృక్పథం, కష్టపడే తత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. ధైర్యం, సంకల్పం, పోరాట స్ఫూర్తితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
కేంద్ర హోంమంత్రిఅమిత్ షా కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రం దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రజల ప్రతిభ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.

















