గాంధీభవన్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులతో మీనాక్షి వరుస భేటీలు.. పార్టీ పరిస్థితిపై ఆరా

ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గాంధీభవన్‌లో రెండో రోజు కూడా జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

మంగళవారం 19 మంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో విడివిడిగా సమావేశమైన మీనాక్షి నటరాజన్.. బుధవారం మరో 19 మంది డీసీసీ అధ్యక్షులతో చర్చించనున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయి? నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఎలా ఉంది? ప్రజల్లో ప్రభుత్వంపై, పార్టీపై స్పందన ఎలా ఉంది? వంటి అంశాలపై మీనాక్షి నటరాజన్ జిల్లా అధ్యక్షులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం.

అలాగే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు, నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తలకు అందుతున్న ప్రాధాన్యత వంటి అంశాలపై కూడా ఆమె లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో పార్టీ పరిస్థితిపై నేరుగా సమాచారం సేకరించి.. సంస్థాగతంగా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడమే ఈ భేటీల ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Spread the love

Related News

Latest News