ఉప్పల్‌లో ఎంఎంసీ నూతన భవనానికి సీఎం రేవంత్ భూమిపూజ

ప్రతిపక్షం, జూన్ 04: ఉప్పల్ భగాయత్‌లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. మూసీ నది ఒడ్డున 9 ఎకరాల విస్తీర్ణంలో రూ.99 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక భవనాన్ని నిర్మించనున్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకోనున్న ఈ కార్యాలయం ద్వారా మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు పాలనా సేవలు మరింత వేగంగా, సులభంగా అందుబాటులోకి రానున్నాయి. స్థానిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News