ప్రతిపక్షం, జూన్ 04: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యమంలో భాగస్వాములై వివిధ రకాలుగా నష్టపోయిన వారికి తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఉద్యమకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వారి సంక్షేమం, ఆత్మగౌరవం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ సాధనలో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి, వారికి తగిన గౌరవం అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.

















