ప్రతిపక్షం, జూన్ 04: దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 8న ప్రతిపక్ష కూటమి సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నేతలు తొలిసారిగా సమావేశం కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొన్ని కీలక ప్రాంతీయ పార్టీలకు ఎదురుదెబ్బ తగలడంతో కూటమి భవిష్యత్ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని మిత్రపక్షాల వైఖరిపై ఆసక్తి నెలకొంది.
కూటమి సమావేశానికి అన్ని భాగస్వామ్య పార్టీలు హాజరవుతాయా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రానున్న రాజకీయ పరిణామాలు, పార్లమెంటు వ్యూహం, రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

















