ప్రతి పక్షం జూన్ 04: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సమావేశానికి బిఆర్ఎస్ హాజరైంది.మా పార్టీ పక్షాన మేము చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పాము.ఉద్యమకారులకు బిఆర్ఎస్ ఏ విధంగా గుర్తింపు ఇచ్చిందో, ఈ ప్రభుత్వం అలానే ఇవ్వాలని డిమాండ్ చేశాము. దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేదు , ఇప్పుడు ఉద్యమకారుల గుర్తింపును సైతం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను ఉద్యమకారుల సమావేశానికి పిలిచారు.తెలుగుదేశం, YSRCP, CPM పార్టీలను పిలిచారు.తెలంగాణ అనేపదం డిక్షనరీలోనే లేదని T TDP అధ్యక్షుడు అంటున్నారు.అలాంటి పార్టీని ఉద్యమకారుల సమావేశానికి ఎలా పిలుస్తారు.తెలంగాణ ఉద్యమకారులను బిఆర్ఎస్ ప్రభుత్వం అనేకరకాలుగా ఆదుకుంది.బిఆర్ఎస్ హయంలో 582 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాము.610 మంది ఉద్యమకారులను గుర్తించి వారిని బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంది.తెలంగాణ ఉద్యమకారుల విషయంలోఈ ప్రభుత్వం లోతైన విచారణ చేసి తెలంగాణ ఉద్యమకారులు ఇంకెవరైనా ఉంటే గుర్తించాలి.తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.చట్టబద్దమైన, కాలపరిమితి లేని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేశారు.మరో 5 యేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న రేవంత్ రెడ్డి టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు.
కార్యాలయం లేని తెలంగాణ ఉద్యమకారుల కమిటి ఉంటే ఏంది లేకపోతే ఏంది.ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన బిఆర్ఎస్ నికార్సుగా కోట్లాడుతుంది.ఇప్పటికైన తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను ఉద్యమకారుల సమావేశానికి పిలవొద్దని డిమాండ్ చేస్తున్నాము.ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ ఈ ప్రభుత్వం జీవో 679 పేరుతో ఉద్యమకారుల కమిటి వేసింది.ఈరోజు జరిగిన ఉద్యమకారుల సమావేశానికి బిఆర్ఎస్ అటెండ్ అయింది.ఉద్యమకారులను అన్ని రకాలుగా బిఆర్ఎస్ ఆదుకుంది.610 మంది ఉద్యమకారులను గుర్తించి ఆదుకున్న ఘనత కేసీఆర్ ది.582 మంది కళాకారులను గుర్తించి వారికి ఉద్యోగాలు ఇచ్చాము.తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఏం చెయ్యబోతుందొ స్పష్టత లేదు.ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము.మాజీ శాసన మండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ సచివాలయంకు వెళ్తుంటే రెండు సార్లు ఆపారు.సామాన్య ప్రజలు సచివాలయంకు పోలేని పరిస్థితి.ఉద్యమకారుల కమిటి కార్యాలయం లేనే లేదు.అఖిలపక్ష సమావేశంలో పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలని మేము తెలియజేశాము.ఈ ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు కె .కిశోర్ గౌడ్ ,విద్యాసాగర్ ,వై .సతీష్ రెడ్డి ,రాఘవేంద్ర యాదవ్ ,అంజన్ రావు ,రవి నాయక్ ,శ్రీను నాయక్ పాల్గొన్నారు.

















