నిందితుడు అరెస్ట్.. బంగారం, నగదు, 14 మొబైల్స్, ద్విచక్ర వాహనం స్వాధీనం
విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ సునీత రెడ్డి
ప్రతిపక్షం, జూన్ 02, వనపర్తి ప్రతినిధి: దాదాపు 55 సంవత్సరాల ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు వనపర్తి ఎస్పీ సునీతా రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సునీత రెడ్డి మీడియా తో మాట్లాడారు. గత నెల మే 30న మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని.. వనపర్తి రూరల్ స్టేషన్ పరిధిలోని శ్రీ మేధా టౌన్ షిప్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తనపై లైంగిక దాడి చేసి, అనంతరం ఆభరణాలు, నగదు దొంగలించాడని ఓ వృద్ధురాలు రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని.. డీఎస్పీ గిరిబాబు, సీఐ రత్నం నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు సీసీ టీవీ పుటజ్, మొబైల్ టవర్ లొకేషన్ వంటి సాంకేతిక సహాయంతో జోగులాంబ గద్వాల జిల్లా,గట్టు మండలం,ఆలూరు గ్రామానికి చెందిన నిందితుడు కుర్వ నవీన్(24) అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 07 గ్రాముల మంగళ సూత్రం, చెవి కమ్మలు (సుమారు 40 వేలు), ఐదు వేల రూపాయల నగదు, ఒక కత్తి, ఒక మోటర్ బైక్, నిందితుడి సెల్ ఫోన్ తో పాటుగా 14 మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి సమాచారం తెలుపుతామని ఆమె పేర్కొన్నారు. చోరీ కేసును ఛేదించిన సీఐ రత్నం, ఎస్సైలు రుషికేష్, హరిప్రసాద్, పోలీస్ కానిస్టేబుల్ నవీన్, ఆంజనేయులు, రఫీ, అభిషేక్, యుగంధర్ గౌడ్,లను జిల్లా ఎస్పీ అభినందించి,రివార్డులను అందజేశారు.ఈ మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా పాల్గొన్నారు.

















