కేబుల్ బ్రిడ్జ్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

ప్రతిపక్షం, జూన్ 03: రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలిని నాగోల్‌కు చెందిన రోజా రమణి (26)గా గుర్తించారు.

ఆమె మాదాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా ఆమె కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ప్రాథమిక విచారణలో బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News