•రైతు భరోసాపై నిలదీస్తారనే భయంతోనే సీఎం హెలికాప్టర్లో పర్యటన
•పలు ప్రశ్నలు సంధించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ప్రతిపక్షం, జూన్ 04, వనపర్తి ప్రతినిధి: రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డ సమయంలో కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల సందర్శన పేరుతో చేస్తున్న ఈ పర్యటనలు ఎవరికి ఉపయోగమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిలదీశారు. సీఎం. రేవంత్ రెడ్డి గురువారం పాలమూరు పర్యటన సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. విపత్తుల సమయంలో రాకుండా , రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా చేస్తున్న ఈ పర్యటనలు ఎవరికి ఉపయోగమని మండిపడ్డారు . సీఎం పర్యటనే వేళ తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం సబబు కాదని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికీ వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని,రైతు భరోసా అడుగుతారనే హెలికాప్టర్లో పర్యటిస్తు న్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఆశలు కోల్పోయారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, భవిష్యత్తులో వారికి పరాభవం తప్పదని హెచ్చరించారు.

















