ప్రతిపక్షం, జూలై 17: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం 35వ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేబినెట్ సమావేశానికి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ ఆదేశించారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

















