ప్రతిపక్షం, జూలై 17: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.96 కోట్లు) బహుమతిగా ఇస్తామని ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ అనే సాయుధ సంస్థ ప్రకటించినట్లు సమాచారం. ఇరాక్‌లో ప్రజలు, చిన్నారుల మరణాలకు, నిరాశ్రయులకు ట్రంప్ కారణమయ్యారని ఆరోపిస్తూ ఈ ప్రకటన చేసింది. ట్రంప్ ప్రశాంతంగా జీవించే హక్కును కోల్పోయారని ఆ సంస్థ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

















