కుమ్మర సంఘంలో కొత్త నాయకత్వానికి ఘన స్వాగతం

పెబ్బేరులో కేక్ కట్ చేసి శాలువాలతో సత్కరించిన సంఘ సభ్యులు

ప్రతిపక్షం, జూలై 17,వనపర్తి ప్రతినిధి: నూతనంగా ఎన్నికైన వనపర్తి జిల్లా కుమ్మర సంఘం నాయకులకు పెబ్బేరులో ఘన సన్మానం నిర్వహించారు. జిల్లా కుమ్మర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సూర్యవంశం పరుశరాముడు, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గోవిందు, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు శేఖర్, యూత్ అధ్యక్షుడు సురేష్ లను మాజీ యూత్ గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి లక్ష్మణ్, బొడ్డుపల్లి రవి ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి, కుమ్మర కుల సమస్యల పరిష్కారానికి నూతన నాయకత్వం కృషి చేయాలని ఆకాంక్షించారు.సన్మానానికి స్పందించిన నాయకులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.కుమ్మర సంఘ సభ్యుల సంక్షేమం, హక్కుల సాధన, ఐక్యత కోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సంఘం సభ్యులు పవన్, చిన్న, వాసు, శ్రీరాజ్, చింటూ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News