ప్రతిపక్షం, జూన్ 03: ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇవ్వబోమన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రాంతాల ఆధారంగా కాంట్రాక్టులు నిరాకరించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై మాట్లాడిన తలసాని, కాంట్రాక్టుల విషయంలో ఆంక్షలు విధించేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలాంటి చట్టాన్ని ముఖ్యమంత్రితో ఆమోదింపజేసి అమలు చేయగలిగితే తాను తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు.
రాజకీయ విమర్శల నేపథ్యంలో ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

















