ధాన్యం దొంగతనాల ముఠా గుట్టురట్టు.. బీటెక్ విద్యార్థులు అరెస్ట్

ప్రతిపక్షం, జూన్ 04: ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల ధాన్యాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. కేవలం పది రోజుల వ్యవధిలో 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాలను అపహరించిన ఘటన కలకలం రేపింది.

పోలీసుల దర్యాప్తులో హనుమకొండ జిల్లాకు చెందిన ప్రతీక్, అస్లాం, రాహుల్ అనే ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఈ ముఠాకు నాయకత్వం వహించినట్లు తేలింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో రైతులు నిల్వ ఉంచిన ధాన్యాన్ని దొంగిలించి, ఇతర ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు విక్రయించినట్లు గుర్తించారు.

ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు, రూ.3.05 లక్షల నగదు, రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Spread the love

Related News

Latest News