మెదక్ అర్బన్ ఫారెస్ట్ పార్కుల గొప్పతనాన్ని పర్యాటకులకు ప్రాచుర్యం కల్పించాలి

  • మెదక్ ఫారెస్ట ను టూరిస్ట్ హబ్ గా రూపొందించాలి
  • 200 చెట్లతో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ప్రారంభోత్సవం
  • జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రతిపక్షం, జూన్ 05, మెదక్: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామం వన్ యోజన అటవీ పార్కు నందు నిర్వహించిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్). హైదరాబాదు నుండి రత్నాకర్, డి ఎఫ్ ఓ జోజి, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ వేణు, సంబంధిత ఎఫ్ ఆర్ ఓ ,రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, యాదగిరి, శర్మ రాజశేఖర్ సర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ ప్రసాద్ లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు.అనంతరం అటవీ శాఖ ఏర్పాటు పర్యావరణ పరిరక్షణపై జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రకారం జిల్లాలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఏక్ పెడ్ మా కే నామ్’ ప్రతి భారతీయుడిని తమ తల్లి మరియు భూమాత గౌరవార్థం ఒక మొక్కను నాటమని ప్రోత్సహించే ఒక హృదయపూర్వక దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమం. అన్నారు. ఇది మాతృత్వంలోని పోషణ స్ఫూర్తిని, ప్రకృతి యొక్క జీవనాధార శక్తితో అనుసంధానించి, మరింత పచ్చని గ్రహాన్ని పెంపొందుతుంది అన్నారు.మొక్కలు నాటుతున్నప్పుడు, మీ అమ్మ ప్రేమను, త్యాగాలను గౌరవించడానికి ఒక్క క్షణం కేటాయించాలని హితవు పలికారు.మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారాల అనే నినాదంతో ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటినీ సంరక్షించి భవిష్యత్తులో వృక్షాలుగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు.
అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్యం పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు సంబంధించి అంశాలపై విద్యార్థి దశ నుండే తెలుసుకోవాలన్నారు.
జిల్లాలో 24% అటవీ సంపద ఉందని ,జిల్లాలో నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోరాబాద్ అర్బన్ ఫారెస్ట్ పార్కులను హైలెట్ చేయడం జరుగుతుందన్నారు.ఈ ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ కు పిల్లలకు ప్రత్యేక టూర్ అరేంజ్ చేసి వారందరికీ జిల్లాలో అటవీ సంపద ఫారెస్ట్ పార్కులు మొక్కల వల్ల భావితరాలకు ఉపయోగం సంబంధిత విషయాలపై అవగాహన కల్పించాలన్నారు.జిల్లాలో అటవీ సంపదను పరిరక్షించడంలో అటవీశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా అడవులను సంరక్షించేందుకు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారని వివరించారు.జిల్లాస్థాయి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా అర్బన్ ఫారెస్ట్ పార్కుల పర్యాటకులకు ప్రాచుర్యం పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాక జోహారీ మాట్లాడుతూ.. జిల్లాలో వరల్డ్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మానవాళి మనుగడకు చెట్లే ప్రతిరూపంగా ఉంటాయన్నారు విశాఖపట్నంలో సునామీ ఏర్పడినప్పుడు చెట్లు ఉన్న ప్రాంతాలలో దాని యొక్క తాకిడి చాలా తక్కువ మొత్తంలో ఉన్నది అంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలన్నారు.గ్రామీణ అభివృద్ధి శాఖ అటవీ శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు జిల్లా అధికారులు ,ప్రజా ప్రతినిధులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News