ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 17: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, టూరిజం శాఖ ఆహ్వానం మేరకు పర్యాటక స్థలాలను సందర్శించడానికి వస్తున్న టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు అభిమానులు, ప్రజలందరూ ఘనంగా స్వాగతం పలకాలని, జిల్లా టూరిజం శాఖ అధికారి రమేష్ ఒక ప్రక్రియలో తెలిపారు రేపు మంచు విష్ణు బృందం ఉదయం 8:30 గంటలకి ఏడుపాయల వన దుర్గ భవాని మాత దర్శనం, 9 గంటల 45 నిమిషాలకు ప్రముఖ మెదక్ ఖిల్లా సందర్శన, 11:15 నిమిషాలకు క్యాథడ్రాల్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసి మీడియా ప్రతినిధులతో సమావేశం లో పాల్గొంటారని, హీరో మంచు విష్ణు పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పర్యటనను విజయవంతం చేయాలని టూరిజం శాఖ అధికారి రమేష్ తెలిపారు.

















