సూసైడ్‌ సెర్చ్ చేస్తే పేరెంట్స్‌కు అలర్ట్.. మెటా కొత్త ఫీచర్

ప్రతిపక్షం, జూలై 17: పిల్లల భద్రత కోసం సోషల్ మీడియా దిగ్గజం మెటా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీనేజర్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోని ఏఐ చాట్‌బాట్లలో ఆత్మహత్య లేదా స్వీయహాని అంశాలపై సెర్చ్ చేస్తే, వారి తల్లిదండ్రులకు అలర్ట్ పంపే విధానాన్ని ప్రవేశపెట్టింది. పిల్లలను ఈ అంశంపై ఎలా సంప్రదించాలనే దానిపై తల్లిదండ్రులకు సూచనలు కూడా అందించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇతర దేశాలకు కూడా విస్తరించనుంది.

Spread the love

Related News

Latest News