రేషన్ కార్డు ఈ-కేవైసీకి ఈ నెల 31 వరకే గడువు

ప్రతిపక్షం, జూలై 17: తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఉచితంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. రేషన్ కార్డుతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను తీసుకెళ్లి రేషన్ డీలర్ లేదా మీ సేవా కేంద్రంలో ఈ-కేవైసీ చేయించుకోవచ్చని తెలిపింది. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నకిలీ రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా ఈ ప్రక్రియను తప్పనిసరి చేశారు.

Spread the love

Related News

Latest News