ప్రతిపక్షం, జూలై 17: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడంతో పాటు, అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్లో మార్పులకు, జగిత్యాల జిల్లాలోని డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేయకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

















