మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సీఈసీ కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూలై 18: టీపీసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయమే తుది అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసేందుకు మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మీనాక్షి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం ఎన్నికల సంఘాన్నీ సంప్రదించారు. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన సీఈసీ.. నామినేషన్ ఫారంలో కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను పూర్తిగా నమోదు చేయాలని మీనాక్షికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఆమె ఆ వివరాలను పూర్తి చేయలేదని తెలిపారు. నామినేషన్ తిరస్కరణపై రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News