పేపర్ లీక్‌లపై రాహుల్ సంచలన ఆరోపణలు.. ఐదు స్థాయుల్లో మాఫియా: ఆరోపణ

ప్రతిపక్షం, జూలై 18: దేశంలో వరుస పేపర్ లీక్‌ల కారణంగా విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పేపర్ లీక్‌ల వెనుక ఐదు స్థాయిల వ్యవస్థ పనిచేస్తోందని డెహ్రాడూన్‌లో జరిగిన సభలో పేర్కొన్నారు.

పేపర్ లీక్ వ్యవస్థపై రూపొందించిన చిత్రాన్ని విడుదల చేసిన రాహుల్.. పైస్థాయిలో మంత్రి, జాతీయ పరీక్షల సంస్థ ఉండగా, మధ్యలో మాఫియా లేదా విక్రేతల పాత్ర ఉంటుందని ఆరోపించారు. ఆ తర్వాత ప్రశ్నపత్రాల రూపకర్తలు, అనువాదకులు, చివరగా కోచింగ్ సంస్థలు, పరీక్షా కేంద్రాలు ఈ వ్యవస్థలో భాగమవుతున్నాయని పేర్కొన్నారు.

పేపర్ లీక్ మాఫియా మొత్తం పరీక్షా వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకుందని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈ వ్యవస్థకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News