ఆరు నెలల్లో 554 మంది భర్తల మృతి.. 322 హత్యలే!

ప్రతిపక్షం, జూలై 18: దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జులై 14 వరకు 554 మంది భర్తలు హత్యలు లేదా ఆత్మహత్యల కారణంగా మృతి చెందినట్లు గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ నివేదిక వెల్లడించింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

నివేదిక ప్రకారం.. భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో 322 మంది భర్తలు హత్యకు గురయ్యారు. మరో 232 మంది వైవాహిక వివాదాలు, గృహహింస తదితర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. మొత్తంగా నమోదైన ఘటనల్లో హత్యలే మెజార్టీగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

Spread the love

Related News

Latest News