ఘట్‌కేసర్‌కు సీఎం రేవంత్.. అందెశ్రీ స్మృతి వనానికి శంకుస్థాపన

ప్రతిపక్షం, జూలై 18: ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఘట్‌కేసర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అందెశ్రీ స్మృతి వనం, ఆయన విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పోలీసులు చేపట్టారు. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News