ప్రతిపక్షం, జూలై 18: భారత అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచే తొలి ప్రైవేట్ రాకెట్‌ను ఇవాళ ప్రయోగించేందుకు ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సిద్ధమైంది. ఈ సంస్థను ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా 2018లో స్థాపించారు.
‘నిత్యం ఆకాశంలోకి విమానాలు ఎగురుతున్నప్పుడు.. రాకెట్లు కూడా అదే తరహాలో ఎందుకు నింగిలోకి దూసుకెళ్లకూడదు?’ అనే ఆలోచనతో స్కైరూట్ సంస్థకు బీజం పడింది. ఆ ఆలోచన నుంచి పుట్టిన సంస్థ ఇప్పుడు భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కీలక అడుగు వేస్తోంది.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఈ ప్రయోగం కొత్త దిశ చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అంతరిక్ష ప్రయోగాలు మరింత విస్తరించేందుకు ఇది బాటలు వేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.


















