ప్రతిపక్షం, జూలై 18: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
భారీ వర్షాలు, పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకపోవడం, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకపోవడం మంచిదని సూచించారు.


















