భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం విజయవంతం

ప్రతిపక్షం, జూలై 18: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర నమోదైంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం కీలక మైలురాయిని చేరుకుంది.

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 రాకెట్ తన ప్రయాణంలో నాలుగు దశలను విజయవంతంగా పూర్తి చేసి లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. సుమారు 350 కిలోల పేలోడ్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా ప్రైవేట్ సంస్థల అంతరిక్ష ప్రయోగాలకు భారత్‌లో కొత్త దారులు తెరుచుకున్నాయి.

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యం ఉండగా, తొలిసారిగా దేశీయ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరడం చారిత్రాత్మక పరిణామంగా భావిస్తున్నారు. ಈ ప్రయోగంతో భారత ప్రైవేట్ స్పేస్ రంగం ప్రపంచ స్థాయిలో మరో కీలక అడుగు ముందుకేసింది.

Spread the love

Related News

Latest News