- మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.
- 115 మందికి కళ్యాణ లక్ష్మి రూ.1.05 కోట్ల చెక్కులు పంపిణీ.
మెదక్, ప్రతిపక్షం, జూన్ 06: పేద ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.శనివారం చిన్న శంకరంపేట మండలంలోని రాదేశాం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 115 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,05,12,480 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

















