తొలి ప్రయత్నంలోనే విజయవంతం.. స్పేస్‌ఎక్స్‌ను మించిన స్కైరూట్!

ప్రతిపక్షం, జూలై 18: భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంచలనం సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే ‘విక్రమ్-1’ను విజయవంతంగా నింగిలోకి పంపడం అంతరిక్ష రంగంలో అరుదైన ఘనతగా నిలిచింది.

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ తొలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు మూడు ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో.. స్కైరూట్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా గతంలో ఇస్రోలో పనిచేశారు. ఒకప్పుడు గణితంలో 51 మార్కులు మాత్రమే సాధించిన పవన్ కుమార్.. నాగ భరత్‌తో కలిసి ప్రస్తుతం బిలియన్ డాలర్ల విలువైన అంతరిక్ష సంస్థను నిర్మించడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

మరో విశేషం ఏమిటంటే.. విక్రమ్-1 మిషన్‌ బృందంలోని సభ్యుల సగటు వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల ప్రతిభతో స్కైరూట్ సాధించిన ఈ విజయం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

Spread the love

Related News

Latest News