యుద్ధాలను ఆపగలగే మోదీ పేపర్ లీక్‌లను ఎందుకు ఆపలేరు?: అభిజీత్ దీప్కే ప్రశ్న

ప్రతిపక్షం, జూన్ 08: సెంటర్ ఫర్ జాబ్స్ అండ్ పాలిటిక్స్ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలమని చెప్పే నాయకత్వం దేశంలో జరుగుతున్న పేపర్ లీక్‌లను ఎందుకు అరికట్టలేకపోతోందని ప్రశ్నించారు.

తనపై దేశద్రోహి అనే విమర్శలు రావడంపై స్పందించిన ఆయన, యువత ఉద్యోగాలు, విద్య, పరీక్షల పారదర్శకత వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సిన సమయంలో హిందూ-ముస్లిం రాజకీయాలు ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలతో ప్రజల అసలు సమస్యలకు పరిష్కారం లభించదని వ్యాఖ్యానించారు.

ఉద్యోగాలు, నియామకాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పేపర్ లీక్‌ల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తు ప్రభావితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయ పొత్తులపై మాట్లాడుతూ, తమ సంస్థకు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు తమ మద్దతుదారులు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ఉంటాయని అభిజీత్ దీప్కే తెలిపారు.

Spread the love

Related News

Latest News